దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వం నగరంలో ట్రిపుల్‌ లాకడౌన్‌ విధించింది. ప్రభుత్వం ప్రజల కదలికలపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. అధికారులు కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేశారు. ప్రస్తుతం ఇక్కడ ఆరోగ్య సేవలతో పాటు ఇతర అత్యవసర సర్వీసులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. 
 
ప్రజలు తమతమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. నగరంలో వాహనాల రాకపోకలపై కూడా నిషేధం విధించటంతో పాటు అనవసరంగా గడప దాటిన వారికి కఠిన శిక్షలు వేస్తామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. కేరళలో సచివాలయంతో పాటూ ప్రభుత్వ కార్యాలయాలలు మూతబడ్డాయి. రాష్ట్రంలోని ఆర్మీ కేంద్రంలోని కొందరు సైనికులకూ కరోనా సోకినట్టు తెలుస్తోంది. కేరళలో నిన్న ఒక్కరోజే 301 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 6,301కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: