ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై ప్ర‌పంచ దేశాలు అన్ని అగ్గిమీద గుగ్గిలం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రో వైపు భార‌త్‌లో స‌రిహ‌ద్దు రేఖ వెంట తీవ్ర ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణానికి కూడా చైనా కార‌ణం అవుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశం ఇప్ప‌టికే చైనాకు చెందిన 59 యాప్‌ల‌ను నిషేధించింది. ఇక ఇప్పుడు అమెరికా సైతం చైనా యాప్‌ల‌ను నిషేధించేందుకు రెడీ అవుతుండ‌గా.. బ్రిట‌న్ సైతం త‌మ దేశంలో చైనా కంపెనీ డ‌వ‌ల‌ప్ చేస్తోన్న 5 జీ టెక్నాలజీ నుంచి ఆ కంపెనీని త‌ప్పిస్తోంది.

 

ఈ క్ర‌మంలోనే చైనాపై ముందు నుంచి అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లే ఇందుకు ఊత‌మిచ్చేలా ఉన్నాయి. వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనాపై అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేను. అయితే సరైన సమయంలో చైనాపై తీసుకోనున్న చర్యలపై కొద్ది రోజుల్లోనే ప్ర‌పంచం ఓ వార్త వింటోంద‌ని చెప్పారు. దీనిని డ్రాగ‌న్‌పై అగ్ర రాజ్యం భారీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోనుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: