గత వారం రోజుల నుంచి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏ స్థాయిలో గాలిస్తున్నారో అందరికి తెలిసిందే. కాన్పూర్ పోలీసులను అతను కాల్చి చంపిన తర్వాత దాదాపు 30 బృందాలు అతని కోసం జల్లడ పడుతున్నాయి.   హర్యానాలో అతని ముగ్గురు అనుచరులను కాల్చి చంపినా తర్వాత అతను అక్కడ ఉండే అవకాశం ఉందని భావించారు. 

 

కానీ  అతను అనూహ్యంగా మధ్యప్రదేశ్ లో ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి వెళ్లి పోలీసులకు దొరికిపోయాడు.  ఇక అక్కడ అతన్ని పట్టుకున్న వెంటనే పోలీసులు చాలా  అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే అతన్ని  పోలీసు వాహనం వద్దకు తీసుకుని వస్తు ఉండగా ఒక పోలీస్ అధికారి అతన్ని వెనుక నుంచి తల మీద కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: