గత వారం రోజుల నుంచి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఏ రేంజ్ లో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడో అందరికి తెలిసిందే. అతన్ని మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయినీ దేవాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే అతన్ని పోలీసులు పట్టుకున్న వెంటనే అతను చెప్పిన మొదటి మాట ఏంటీ అంటే... 

 

"మెయిన్ వికాస్ దుబే హూన్, కాన్పూర్ వాలా" అంటూ పోలీసులకు సమాధానం ఇచ్చాడు.  అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులకు నేడు లేదా రేపు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అతన్ని అరెస్ట్ చేసిన సమయంలో ఏ విధమైన సంఘటనలు జరగకుండా ఉండటానికి గానూ పోలీసులు చాలా వరకు  జాగ్రత్తగా వ్యవహరించారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: