కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నా సరే ఫలితం మాత్రం కనపడటం లేదు. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు భారీగా  పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఇప్పుడు మరోసారి కొన్ని ప్రాంతాల్లో కేరళ సర్కార్ లాక్ డౌన్ ని అమలు చేస్తుంది. 

 

ఈ నేపధ్యంలోనే లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేయడానికి గానూ ఏకంగా కేంద్ర బలగాలను రంగం లోకి దించారు. లాక్‌డౌన్ మార్గదర్శకాలను అమలు చేయడానికి 25 మంది కమాండోలు స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ (ఎస్‌ఐపి) ను పూంతురాలో మోహరించారు. "కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ, & మెరైన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా ఫిషింగ్ బోట్లు తమిళనాడుకు వెళ్ళడం లేదా తిరిగి రాకుండా కట్టడి చేయడానికి గానూ ఇక్కడ పహారా కాస్తున్నారు అని ఆ రాష్ట్ర డీజీపీ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: