కరోనా కట్టడిలో సమర్ధవంతంగా వ్యవహరించే రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాయి అనే సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లో  కరోనా కేసులు ఒక్క అసోం లో మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 11 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే మేఘాలయా లో జులై 5 లెక్కల ప్రకారం మొత్తం 70 కేసులు ఉన్నాయి. 

 

వీరిలో 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఒకరు మాత్రమే కరోనా బారిన పడి మరణించారు. ఇక అక్కడ రికవరీ రేటు 89.1 శాతంగా ఉంది. ఇక  ఆ రాష్ట్రంలో జనాభా 37 లక్షల వరకు ఉంది. అయితే కేంద్రం కంటే ముందే తాము అప్రమత్తం అయి లాక్ డౌన్ ని ప్రకటించామని, మాస్క్ లను అందించామని ఆ రాష్ట్రం సిఎం పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: