ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయనను అసలు ఎందుకు అరెస్ట్ చేసారని కొందరు ఆయన ఆరోగ్యం బాగా లేదు అని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసారు. 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అరెస్టులో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన జరుగుతుందని మండిపడ్డారు. శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని 600 కి.మి వాహనంలో తరలింపా? అని ప్రశ్నించారు. దారిపొడవునా రక్తస్రావమని... రాజకీయ కక్ష సాధింపు కోసం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా? ని ప్రశ్నించారు. ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది వైఎస్ జగన్ గారూ అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: