క‌ర్నాట‌క‌లోని బెళగావి జిల్లాలో ఇద్దరు సీనియర్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం అక్క‌డ రాజ‌కీయాల‌ను వేడెక్కించేస్తోంది. మంత్రి ర‌మేశ్ జార్కి హోళి వ‌ర్సెస్ ఎమ్మెల్యే ల‌క్ష్మీ హెబ్బాల్క‌ర్ మ‌ధ్య కొద్ది రోజులుగా ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రు ఒకే పార్టీలో ఉండేవారు. అయితే ఆ త‌ర్వాత వీరు పార్టీలు మార‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం పెద్ద యుద్ధాన్ని త‌ల‌పించేస్తోంది. ఈ క్ర‌మంలోనే మంత్రి ర‌మేశ్ మాట్లాడుతూ గ‌తంలో 
బెళ గావి పురపాలక అభివృద్ధి సంస్థ (బుడా) మెంబర్‌ను చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ త‌న కాళ్ల‌మీద ప‌డ్డార‌ని.. లింగాయ‌త్ స‌మాజం అభివృద్ధి చెందాల‌నే తాను ఆమెకు సాయం చేశాన‌ని చెప్పారు. 

 

ఏ మాత్రం రాజ‌కీయం తెలియ‌ని  ల‌క్ష్మిని తానే రాజ‌కీయంగా అభివృద్ధి చేశాన‌ని చెప్పారు. మంత్రి వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే ల‌క్ష్మీ సైతం ఘాటుగా స్పందించారు. మంత్రి ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ఆయ‌న ఇలా మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తోన్న కుక్క‌ర్ విష‌యం కోర్టులో ఉన్నందున దీనిపై మాట్లాడితే కోర్టు ధిక్కారం అవుతుంద‌న్న విష‌యం గుర్తించుకోవాల‌న్నారు. దీనిపై ఆధారాలుంటే మంత్రికి సూచించారు. ఏదేమైనా పురుష మంత్రి వర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ వార్ క‌ర్నాట‌క రాజ‌కీయాల‌ను మంచి హీటెక్కిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: