క‌రోనా మ‌హ‌మ్మారి భ‌యం ఎలా ఉందంటే ఎవ‌రైనా మ‌నుష్యులు క‌ష్టాల్లో ఉంటే వారికి సాయం చేసేందుకు కూడా ఎవ్వ‌రు వెళ్లి వారిని ట‌చ్ చేసే ప‌రిస్థితి లేదు. నిన్న‌టికి నిన్న హైద‌రాబాద్‌లోని ఈసీఐఎల్ చౌర‌స్తాలో పృథ్వీరాజ్ అనే వ్య‌క్తి రోడ్డు మీద కింద‌ప‌డి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కూడా చుట్టూ చూస్తోన్న జ‌నాలు సెల్‌ఫోన్లో వీడియోలు తీస్తున్నారే త‌ప్పా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లోని కొన్ని ప్రాంతాల్లో క‌రోనాతో పాటు డెంగీ కూడా తీవ్రంగా ప్ర‌బ‌లుతోంది.

 

తాజాగా క‌ర్నాక‌ట‌లోని ఉడుపి జిల్లాలో కరోనాతోపాటు డెంగీ కూడా ప్రబలుతోంది. ఈక్రమంలో బెళ్మణ్‌కు చెందిన దివ్యా(23) అనే నర్సు డెంగీ లక్షణాలతో మృతి చెందింది. ఉడుపిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తున్న ఆమె 15 రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె అదే ఆసుప‌త్రిల చికిత్స కూడా తీసుకుంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం జ్వ‌రంగా తీవ్రంగా ఉండ‌డంతో మంగ‌ళ‌వారం మ‌రోసారి ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ఆమె అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ప్ర‌స్తుతం క‌రోనా రోగుల‌కు, ఇతర రోగుల‌కు వైద్యం చేసేందుకు కూడా న‌ర్సులు భ‌య‌ప‌డుతోన్న ప‌రిస్థితి నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: