వికాస్ దూబే... గత వారం రోజుల నుంచి జాతీయ స్థాయిలో ఈ పేరు మారుమోగిపోతుంది. అతను చేసిన నేరం అంతర్జాతీయంగా కూడా వైరల్ అయింది అంటే అతను ఏ స్థాయిలో సంచలనం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు. వారం రోజుల నుంచి అతను తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు. అయితే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని దేవాలయం వద్దకు దర్శనం ఏర్పాట్లు చేసుకుని మరీ వెళ్ళాడు అతను. 

 

అక్కడ అతను గుడిలో ఫోటోలు కూడా దిగాడు అని తెలిసింది.  అక్కడ ఉన్న కొందరిని అతను ఫోటోలు తీయాలి అని కోరాడు. ఇక హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ నుంచి అతను దాదాపు  700 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉజ్జయిని వచ్చాడు అని  పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: