ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ కాస్త అదుపులోనే ఉంది. అక్కడ నిదానంగా కేసులు  పెరుగుతున్నాయి గాని ప్రస్తుతం అయితే చాలా వరకు కట్టడిలోనే ఉంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే  ఉత్తరప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ  కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బ్రెజిల్ తో పోల్చారు ఉత్తరప్రదేశ్ ని. 

 

ఉత్తర ప్రదేశ్‌కు సమానమైన జనాభా కలిగిన బ్రెజిల్ వంటి దేశంలో 65,000 మంది మరణించారని ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు, అంటే రాష్ట్రంలో చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయని ఆయన  వారణాసి లోని ఎన్జీవోలతో నిర్వహించిన ఒక సమావేశంలో వ్యాఖ్యలు చేసారు. కాగా ఏపీతో పోలిస్తే అక్కడ కేసులు తక్కువ మరణాలు ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: