ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా సరే విపక్షాలు ఏదోక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. రైతు భరోసా విషయంలో అధికారులు చేసే చిన్న చిన్న తప్పులను కూడా పదే పదే ప్రస్తావిస్తూ సిఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇలాగే టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శలు చేసారు. 

 

వ్యవసాయ బడ్జెట్లో ఖర్చు చేసింది మూడో వంతు మాత్రమే. మాఫీ బకాయిలు 7వేల కోట్లు ఎగ్గొట్టారు రైతులను కులాల పేరుతో  విభజించి 13 లక్షల మంది కౌలు రైతులను ముంచారు. ధరల స్థిరీకరణ నిధులెక్కడ ఖర్చుపెట్టారు? ఎంత మంది రైతులకు సున్నా వడ్డీ, బీమా పరిహారం చెల్లించారో శ్వేత పత్రం విడుదల చేయగలరా? వైఎస్ జగన్ గారూ అంటూ ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: