భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి కాస్త మెరుగు పడింది. గత రెండు నెలల నుంచి సరిహద్దుల్లో ఆందోళన వాతావరణం ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త అదుపులోకి రావడంపై రెండు దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు చైనా, భారత్ కమాండర్ ల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 

 

రెండు దేశాలకు చెందిన కీలక అధికారులు చర్చించే అవకాశాలు ఉన్నాయి. రేపు లేదా ఎల్లుండి మరోసారి చూశుల్ ప్రాంతంలో చర్చించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. జాతీయ మీడియా కూడా దీనిపై కథనాలు ప్రసారం చేస్తుంది. చైనా సరిహద్దుల్లో  భారత్ ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. కాగా ఇటీవల చైనా ఆర్మీ రెండు కిలోమీటర్ల వరకు వెనక్కు వెళ్ళిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: