ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గ్లోబల్ వీక్ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడారు. కరోనా ప్రభావం నుంచి ప్రపంచం కోలుకుంటోందని మోదీ చెప్పారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. భారత వైద్యులు, నర్సులు అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా పోరులో భారత్ కష్టాన్ని ప్రపంచం గుర్తించిందని తెలిపారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నామని చెప్పారు.  
 
ఈ సమావేశానికి వర్చువల్ కాన్ఫరెన్స్ కు 30 దేశాల నుంచి 5,000 మంది హాజరయ్యారు. రాజకీయాలు, వ్యాపారం, టెక్నాలజీ, ఫార్మా, కోవిడ్ గురించి ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరగనుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: