టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కనిపించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ కనిపించకపోతే పాలన ఆగిందా.....? ప్రభుత్వ పథకాలు ఆగాయా? అని విపక్షాలను ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. 
 
బీజేపీ నాయకులకు చేతనైతే దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని సూచనలు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనటం సరి కాదని అన్నారు. ఎంఐఎంతో కలిస్తే.. కరోనా వచ్చేస్తోందా? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయని హైదరాబాద్ లో లాక్ డౌన్ పెట్టినా ప్రయోజనం ఉండదని చెప్పారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: