తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉంది. వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తాజాగా కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కాపాడటం సాధ్యమవుతుందని తెలిపారు. 
 
పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించడం ద్వారా కోలుకుంటున్న ఘటనలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో అవసరమైన కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స అందిస్తున్నారు. కరోనా చికిత్స కోసం కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా మారిన వారి నుంచి ప్లాస్మా సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ప్లాస్మా బ్యాంక్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: