దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొన్ని నెలలుగా తక్కువ కేసులు నమోదైన కేరళలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేర‌ళలోని పుంథూరా గ్రామంలో తొలి కరోనా క్లస్టర్ ఏర్పాటైంది. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 25 క‌మాండోల బృందం అక్కడ పహారా కాస్తోంది. ఆరు ప్రత్యేక బృందాలు అక్కడ సేవలందిస్తున్నాయి. 
 
పుంథూరా గ్రామంలో మొద‌టిసారిగా చేప‌ల వ్యాపారికి క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. అతను స్థానికంగా చెపలు విక్రయిస్తూ ఉంటాడు. చేపల వ్యాపారి కాంటాక్ట్ అయిన 600 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కేవ‌లం ఐదు రోజుల్లోనే 119 మందికి కరోనా నిర్ధారణ అయింది. పుంథూరా తీర ప్రాంతం కావ‌డంతో చేపలపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు ఎక్కువ. గ‌డిచిన 24 గంట‌ల్లో 301 కేసులు నమోదు కాగా పుంథూరా, తిరువ‌నంత‌పురం నుంచి ఎక్కువ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: