టిక్ టాక్ యాప్ కు వరుస షాకులు తగులుతున్నాయి. భారత్‌, అమెరికా బాటలో ఆస్ట్రేలియన్లు టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని ఆందోళన చేస్తున్నారు. టిక్ టాక్ యాప్ వల్ల డేటా చౌర్యం ముప్పుందంటూ అక్కడి ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. సాక్షాత్తూ ఆస్ట్రేలియా శాసనసభ్యులు టిక్ టాక్ యాప్ ను నిషేధించాలంటూ ప్రతిపాదనలు చేస్తూ ఉండటం గమనార్హం. లిబరల్ సెనేటర్ జిమ్ మోలన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టిక్ టాక్ కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. 
 
ఆయన మాట్లాడుతూ టిక్‌టాక్‌ను చైనా ప్రభుత్వం వాడుకుంటున్నదని, దుర్వినియోగం చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ జోక్యంపై సోషల్ మీడియాద్వారా సెలెక్ట్ కమిటీని ఎదుర్కోవాలని టిక్‌టాక్ ప్రతినిధులను ఆయన డిమాండ్ చేశారు. టిక్‌టాక్‌ డేటా అంతా యూఎస్‌, సింగపూర్‌లోని సర్వర్లలో స్టోర్‌ అవుతుందని యాప్ యజమాని బైట్‌డాన్స్‌ చెబుతున్నా చైనా ప్రభుత్వానికి డేటాను పొందడం కష్టం కాదని దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: