దేశంలో విజృంభిస్తోన్న కరొనా వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతోంది. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలపై కరోనా ప్రభావం పడింది. అధికారులు కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలను ‘కంటైన్మెంట్ జోన్’ గా ప్రకటించారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించా ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని చెప్పారు. 
 
ఏపీలో శ్రీవారి ఆలయాన్ని తెరిచి నెల రోజులు దాటింది. గత కొన్ని రోజులుగా టీటీడీ సిబ్బంది కరోనా భారీన పడుతున్నారు. . మొదట్లో రోజుకు కేవలం 6,000 మంది భక్తులకు మాత్రమే అనుమతినిచ్చిన టీటీడీ ప్రస్తుతం 12,000 మంది భక్తులకు అనుమతిస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు జూన్ 8 నుంచి దర్శనానికి అనుమతులిచ్చారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: