భారత్ చైనా సరిహద్దుల్లో చైనా క్రమంగా వెనక్కు తగ్గుతుంది. మొన్నటి వరకు పదే పదే భారత ఆర్మీని రెచ్చగొడుతూ వచ్చిన చైనా ఆర్మీ ఇప్పుడు క్రమంగా వెనక్కు తగ్గడం గమనార్హం. ముందు దూకుడుగానే ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ఆ దూకుడు ప్రదర్శించడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా చైనా ఆర్మీ ఆక్రమించిన ప్రాంతాల నుంచి వెనక్కు వెళ్తుంది. 

 

పెట్రోలింగ్ పాయింట్ 17 (హాట్ స్ప్రింగ్స్) వద్ద ఈ రోజు భారతదేశం మరియు చైనా బలగాలు వెనక్కు తగ్గాయి. దీనితో, పిపి -14, పిపి -15 మరియు పిపి -17 వద్ద పూర్తిగా ఆర్మీ అనేది లేదు అని అధికారులు వెల్లడించారు. లడఖ్‌లోని ఫింగర్ ప్రాంతంలో చైనా సైన్యం  క్రమంగా బలహీనపడుతుంది అని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: