భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పరిక్షల సంఖ్యను కూడా వేగంగానే చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నేడు ఏకంగా 2 లక్షల 67 వేల కరోనా పరీక్షలను నిర్వహించారు. దేశంలో అత్యధికంగా కరోనా పరిక్షలు నిర్వహించడంతో కేసులు కూడా వేగంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 

 

పరీక్షల సంఖ్య పెరిగిందని పేర్కొంది. సగటున, తాము రోజుకు 2.6 లక్షల కంటే ఎక్కువ నమూనాలను పరీక్షిస్తున్నామని ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త నివేదా గుప్తా వెల్లడించారు.  యాంటిజెన్ పరీక్షను ఉపయోగించడం ద్వారా మరింత పెరుగుదల కనబడుతుందని తాము ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కాగా దేశంలో పరిక్షల సంఖ్య 3 లక్షల వరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: