ఈ మద్య ప్రపంచంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరు కనిపించకుండా ఉన్నా పలు అనుమానాలు వస్తున్నాయి. అయితే కరోనా భయంతో కొంత మంది హూం క్వారంటైన్ లోకి వెళ్లడం.. బయట వారితో అస్సలు టచ్ లో లేకపోవడంతో వారు కరోనాతో పోయారన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నగర మేయర్‌ పార్క్‌ ఓన్‌సన్స్‌ అదృశ్యం అయ్యారు. ఆయన ఆచూకీ కోసం ముమ్మర  ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.  కాగా, మేయర్ మొన్న మంగళవారం నుంచి కనిపించడం లేదని ఆయన కూతురు నగర అధికారులకు సమాచారం అందించారని స్థానిక వెబ్‌సైట్‌ ఆర్టీ డాట్‌కామ్‌ పేర్కొంది.

 

పార్క్‌ ఓన్‌సన్స్‌ మంగళవారం నుంచి విధులకు కూడా హాజరు కాలేదని.. ఆయన కోసం ఫోన్ కాల్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ వస్తుందని అక్కడి మీడియా పేర్కొంది. అయితే ఆయన చివరిసారిగా ఎవరితో మాట్లాడారు.. ఎక్కడ ఉన్నారు అన్న విషయం పార్క్‌ ఓన్‌సన్స్‌ వాడిన  సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ చివరిసారిగా ఏ ప్రాంతంలో నమోదయ్యాయో కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

 

మరోవైపు మేయర్ అదృశ్యంపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేదా ఎవరికీ కనిపించకుండా ఆయనే స్వియ నిర్భందంలో ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: