తెలంగాణా విద్యా వ్యవస్థపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతితెలిసిందే. దాదాపుగా అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతులను పెంచడానికి గానూ కాస్త జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది. దీనిపై తెలంగాణా  మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కార్పోరేట్ స్థాయితో విద్యను ఉచితంగా అందించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 900లకు పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

 

కల్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, రైతు బంధు పథకాలతో సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ లో 50 శాతానికి పైగా  వ్యవసాయం కోసం ఖర్చు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటితో సూర్యాపేట జిల్లా వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయిందని ఆయన అన్నారు. బీడు భూములన్నీ ససస్యశామల౦ అవుతున్నాయి అని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: