ఈ కరోనా దెబ్బకు ఇప్పుడు దాదాపుగా ఆర్టీసి నష్టాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా ప్రజా రవాణా అనేది లాక్ డౌన్ లో బాగా దెబ్బ తినడం మనం చూసాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసి అయితే నానా కష్టాలు పడుతుంది. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ లో కోల్పోయిన ఆదాయాన్ని తెచ్చుకోవడానికి గానూ ఆర్టీసి ఏపీ లో కాస్త వినూత్నంగా ఆలోచించే  ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కార్గో సేవలతో ప్రజలకు దగ్గరైంది.

 

సంచార రైతుబజార్, కోవిడ్ పరీక్షలు నిర్వహించే సంజీవిని వాహనాలతో పాటుగా  డ్రైవింగ్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలను కూడా ఇక ఏపీలో తీసుకుని రానున్నారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: