కరోనా మందు కోసం ఏ దేశం ఏ విధంగా ఎదురు చూస్తుందో గాని  భారత్ మాత్రం చాలా ఆశగా ఎదురు చూస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంకా కరోనా వెళ్ళలేదు. వెళ్ళింది అంటే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది దాదాపుగా సాధ్యం అయ్యే పని కాదు. అందుకే కేంద్రం కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సిన్ కి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. 

 

భారత్ బయోటెక్, క్యాడిలా హెల్త్‌కేర్ కరోనా వ్యాక్సిన్‌‌ను అభివృద్ధి చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారి రాజేష్ భూషణ్ వివరించారు. డీసీజీఐ ఆమోదం తర్వాత రెండు వ్యాక్సిన్లకు సంబంధించి యానిమల్ టాక్సిసిటీ స్టడీస్‌ పూర్తి అయ్యాయి అని ఆయన వివరించారు. ఈ రెండు వ్యాక్సిన్లను ఫేజ్ 1, ఫేజ్ 2 దశల్లో క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి లభించింది అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: