కరోనా  వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతు ఎంతో మందిని బలి తీసుకుంటున్న  విషయం తెలిసిందే. సామాన్య ప్రజలకే కాదు ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ అధికారులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారినపడి ప్రాణాలు వదులుతున్నారు. అయితే బెంగళూరు నగరంలో కూడా రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న పోలీస్ అధికారుల సంఖ్య ఎక్కువవుతోంది. 

 

 ఇప్పుడు వరకు బెంగళూరులో ఏకంగా 395 మంది  పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారని  అడిషనల్ కమిషనర్ తెలిపారు, ఇక వీరిలో 190 మంది కోలుకోగా..  200 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా  వైరస్ వ్యాప్తి కారణంగా ఏకంగా ఇరవై పోలీస్ స్టేషన్లకు సీలు వేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: