దేశంలో ఈ మద్య కరోనా కేసులు బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు కరోనా ప్రభావం మనుషుల మీద పడింది. ఈ ప్రభావం జంతువులపై పడలేదు. కానీ అక్కడక్కడ కొన్ని జంతువులకు కూడా కరోనా సోకుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  ముంబైలోని సంజ‌య్ గాంధీ జాతీయ పార్కులో గురువారం ఉద‌యం రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ ఆనంద్ చ‌నిపోయింది. ఆనంద్ గ‌త కొంత‌కాలం నుంచి క్యాన్స‌ర్ క‌ణితితో పాటు మూత్ర‌పిండాల వ్యాధి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది.

 

ఆనంద్ కు ఈ ఏడాది జూన్ నెల‌లో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.  కింద ద‌వ‌డ భాగంలో క్యాన్స‌ర్ క‌ణితిని గుర్తించారు. దాంతో పాటు కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు.  ఈ కారణంతోనే గత పది రోజుల నుంచి ఆనంద్ ఆహారం తినకుండా ఉంటూ వచ్చిందట. . దీంతో పూర్తిగా అది బ‌ల‌హీన‌మైపోయింది.  కేవలం చికెన్ సూప్ మాత్రమే తింటూ ఉందని జూ అధికారుల తెలిపారు.

 

ఇక ఆనంద్ కిడ్నీలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.  పులుల సాధార‌ణ సీరం క్రియాటిన్ లెవ‌ల్స్ 5 -6 మాత్ర‌మే.  పులుల సాధార‌ణ జీవిత కాలం 14 నుంచి 16 ఏళ్లు. సంజ‌య్ గాంధీ నేష‌న‌ల్ పార్కులో మొత్తం ఐదు రాయ‌ల్ బెంగాల్ టైగర్స్ ఉండ‌గా.. అందులో ఒక‌టి మ‌గ పులి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: