దేశంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దు కావడంతో విద్యార్థులు సులభంగా పై తరగతులకు ప్రమోట్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం పదోతరగతి పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ తాజాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయడంతో పాటు ఇంటర్ మార్కుల మెమోల డేట్ ను ప్రకటించింది. 
 
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31 తర్వాత విద్యార్థులు మార్కుల మెమోలను సంబంధిత కళాశాలల్లో పొందవచ్చని చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి పది రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: