దేశంలో కరోనా వైరస్ వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. కేరాళలో మొదట కేసులు నమోదు అయ్యాయి.. ఆ మద్య కేరళాలో కేసులు తగ్గు ముఖం పట్టాయి.  కానీ ఈ మద్య మళ్లీ పెరిగిపోతూ వచ్చాయి.  కేరళలో స‌ముద్ర తీర గ్రామం పుంథూరాలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.  మొట్ట మొదట ఇక్కడ ఓ చేపల వ్యాపారికి కరోనా సోకింది. దీంతో అతడి దగ్గర చేపలు కొన్న వారికి, అత‌డిని కలిసిన వారికి ప‌రీక్ష‌లు చేసి 119 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. 

 

చేపల విక్రయదారుడికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారిని కూడా చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా మత్స్య కారులను ఆదేశించారు. పుంథూరా సముద్ర తీర ప్రాంతం కావడంతో అక్కడ నివసిస్తున్న చాలా కుటుంబాలు చేపలు వేటాడి జీవనం సాగిస్తుంటాయి. గ్రామం మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉందని అన్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైంది పుంథూరా, తిరువనంతపురం గ్రామాల‌ నుంచే అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: