దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే లండన్ పరిశోధకులు తాజాగా మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు వాళ్లు తెలిపారు. కరోనా రోగుల్లో స్ట్రోక్స్, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత,మానసిక సమస్యలను గుర్తించామని... పలు అధ్యయనాల ప్రకారం గందరగోళం, స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా ఏర్పడవచ్చని చెప్పారు. 
 
అరుదుగా కనిపించే సమస్యలైనప్పటికీ, బాధితుల సంఖ్య చాలా ఎక్కువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. పంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డేటాను సమీక్షించాల్సి మరిన్ని పరిశోధనలు ఈ అంశం గురించి చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: