కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉన్నదనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.శివశంకర్‌ ను విధుల నుంచి తొలగించారు. ఈ కేసు రక రకాల ట్విస్టులతో ముందుకు సాగుతుంది. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్‌ వ్యవహారం‌పై దర్యాప్తు జరుపాలని ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు కేరళ సీఎం పినరాయి విజయన్ గురువారం తెలిపారు. ఈ కేసునకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన చెప్పారు. 

 

అంతే కాదు ఇప్పుడు దేశం మొత్తం కరోనా కష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం ఆర్థిక వ్యవస్థను ప్రశ్నించే విధంగా ఉందని అన్నారు.  ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరిపై కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తన రాజీనామాను కోరడం సహజమేనని, తాను సీఎం కుర్చీలో కూర్చోవడం వారికి ఇష్టం లేదని విజయన్ విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: