దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అగ్ర‌రాజ్యం అమెరికా కూడా కరోనా దెబ్బకు కుదేలవుతోంది. కరోనా వల్ల అక్కడ నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లేబ‌ర్ డిపార్ట్మెంట్ గురువారం విడుదల చేసిన లెక్క‌ల‌ ప్రకారం గత వారం 1.3 మిలియన్ల మంది తాము నిరుద్యోగులమని పేర్కొనగా తాజాగా మిలియన్ కు పైగా తాము నిరుద్యోగులమని పేర్కొన్నారు. 
 
మరోవైపు అంటువ్యాధి నిరుద్యోగ సహాయం కార్యక్రమం కింద సాయం కోరుతూ 10 లక్షల మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి సంఘాలు, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా జూన్ చివరివరకు 18.1 మిలియన్ల మందికి ప్రయోజనం చేకూరగా ప్రస్తుతం ఆ సంఖ్య 19.3 మిలియన్లుగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: