రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలు దాటింది. కొత్తగా 1410 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 30,946కి చేరింది. కొవిడ్​తో మరో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 331కి పెరిగింది. కొత్తగా 913 మంది వైరస్​ నుంచి కోలుకోని డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 18,192కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,423 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  గురువారం వచ్చిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 918 రాగా.. రంగారెడ్డి పరిధిలో 125 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 67, సంగారెడ్డి 79 కొవిడ్​ కేసులొచ్చాయి.  

 

రికార్డులను తిరగరాస్తూ.. గడచిన పది రోజుల్లో కరోనా మహమ్మారి కేసులు భారీగా వెలుగుచూశాయి. ఈనెల 1 నుంచి 9 వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30,946కి చేరింది. అంటే రాష్ట్రంలో 9 రోజుల్లో నమోదైన కేసుల సంఖ్య 14,607. అంటే జూన్ నెలతో పోలిస్తే దాదాపు 3 రెట్లు అధికంగా కేసులు వెలుగుచూస్తున్నట్టు స్పష్టమవుతోంది. జీహెచ్​ఎంసీలో ఇప్పటి వరకు 24,141 కేసులు నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు మూడొంతులు.. గ్రేటర్​ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: