కార్మిక చట్టాల సంస్కరణలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన 'ది కోడ్​ ఆన్ వేజెస్​ 2019'ను సెప్టెంబర్​ నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ముసాయిదా నియమాలపై ఫీడ్​బ్యాక్​ కోసం కార్మిక, ఉద్యోగ మంత్రిత్వ శాఖ ప్రజలకు ఉంచినట్లు వెల్లడించారు.
కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో ఈ కోడ్​ను ఆమోదించింది. కార్మికుల సమస్యల పరిష్కారం సహా ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించే విధంగా కోడ్​ను రూపొందించింది. జులై 7న కార్మిక శాఖ నియమాలను అధికారిక గెజిట్​లో పొందుపర్చింది.

 

 

కార్మిక చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో కోడ్ ఆన్ వేజెస్ మొదటిది. మొత్తం 44 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా విభజించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన వైద్య భద్రత విభాగాలుగా మార్చాలని కసరత్తులు చేస్తోంది.ఈ కోడ్​ వల్ల 50 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ పార్లమెంట్​లో జరిగిన చర్చలో భాగంగా పేర్కొన్నారు. లోక్​సభలో ఈ బిల్లు 2019 జులై 30న పాసైంది. అదే ఏడాది ఆగస్ట్​ 2న రాజ్యసభ దీనికి ఆమోదముద్ర వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: