ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబే నిన్న ఉదయం స్థానిక పోలీసుల సమాచారంతో అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి కాన్పూర్ కి వికాస్ దూబే  ను తీసుకొని వస్తున్నా  ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్  కాన్వాయ్ లో ఒక వాహనం బోల్తా పడింది. అక్కడ జరిగిన సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 


వికాస్​.. మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలోని మహాకాల్​ ఆలయానికి వెళ్తుండగా.. భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన స్థానిక పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం.. తానే వికాస్​ దూబేనని, కాన్పుర్​ వాసినని అంగీకరించాడు. వికాస్​ అరెస్టును మధ్యప్రదేశ్ హోం​ మంత్రి నరోత్తమ్​ మిశ్రా ధ్రువీకరించారు. యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దూబే అరెస్టైన విషయాన్ని మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఫోన్​లో తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులకు నిందితుడిని అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: