చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన భయంకరమైన కరోనా వైరస్ ఎవరూ ఊహించని విధంగా మరణ శాసనాన్ని లిఖిస్తుంది.  ఇది చైనీయులు టార్గెట్ చేశారా.. యాధృచ్చికంగా వచ్చిందో తెలియదు కానీ.. ప్రపంచంలోని ప్రజలు ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు కరోనా జపం చేస్తున్నారు. తుమ్మినా.. దగ్గినా పారిపోతున్నారు.. బయటకు రావాలంటే మాస్క్ తప్పనిసరి.. సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ జీవితంలో ఓ భాగం అయ్యింది.

 

అయితే కరోనా ప్రభావం ప్రపంచ దేశాల్లో ఒక ఎత్తైతే కేవలం అమెరికాలోనే దారుణంగా మూడో వంతు కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. దేశంలో నిన్న రికార్డు స్థాయిలో 65,551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు మొత్తం 3,21,19,999 మంది కరోనాబారిన పడ్డారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 16,57,749 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 14,26,428 మంది కోలుకున్నారు.

 

గురువారం కొత్తగా 960 మంది కరోనా బాధితులు మరణించడంతో ఈ వైరస్‌తో మృతుల సంఖ్య 1,35,822కు చేరింది. అమెరికాలో ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. దేశంలో బుధవారం 60,200 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: