ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌పంచ‌మే అతలా కుత‌లం అవుతోన్న వేళ మ‌న‌దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ ప‌రిస్థితులు రోజు రోజుకు దిగ‌జారిపోతున్నాయి. మ‌న దేశంలో మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడులో క‌రోనా కేసులు ఇప్ప‌టికే ల‌క్ష దాటేశాయి. ఈ రెండు రాష్ట్రాల‌కు పోటీగా ఇప్పుడు ఢిల్లీ కూడా వ‌చ్చి చేరుతుంది. ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 1.07 ల‌క్ష‌ల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వ‌ల‌స కార్మికులు ఎక్కువుగా ఉండ‌డంతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్ర‌జ‌లు రాజ‌ధానికి రావ‌డంతో ఇక్క‌డ క‌రోనా కేసులు రోజు రోజుకు తీవ్రంగా పెరిగి పోతున్నాయి.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ 3258 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. సీఎం కేజ్రీవాల్ క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా కూడా క‌రోనా మాత్రం రోజు రోజుకు పెరిగి పోతోంది. ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం సీజ‌న్ కావ‌డంతో పాటు ఢిల్లీలో కాలుష్యం ఎక్కువుగా ఉండ‌డం, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో క‌రోనా మ‌రింత‌గా పెరిగి పోతుంద‌న్న ఆందోళ‌న‌లు ఎక్కువ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: