తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మ‌రో వైపు లాక్ డౌన్ ఎత్తివేయ‌డంతో పాటు ప్ర‌భుత్వం సైతం చేతులు ఎత్తేసిన‌ట్టే క‌నిపిస్తోంది. లాక్ డైన్ ఎత్తేసిన ప్ర‌భుత్వం.. క‌రోనా కంటే లాక్ డౌన్ కంటిన్యూ చేయ‌డం వల్లే ఎక్కువ మ‌ర‌ణాలు వ‌స్తాయ‌ని కూడా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఇత‌ర మంత్రులు చెపుతున్నారు. ఇక తాజాగా తెలంగాణలో 1,410 మందికి కరోనా సోకింది. ఒక్కరోజు ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,946కు చేరుకుంది. 

 

ఇక తెలంగాణ‌లో క‌రోనా మ‌ర‌ణాలు 341కు చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే హైద‌రాబాద్‌లో ఏకంగా 918 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. హైదరాబాద్ తో పాటు గత పది రోజులుగా జిల్లాలకు కూడా కరోనా వైరస్ సోకుతోంది. ఇక తెలంగాణాలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,423గా ఉంది. 18,912 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు క‌రోనా జోరు, వ్యాప్తి చూస్తుంటే తెలంగాణ మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ స్థాయికి వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంద‌ని పలువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: