సచివాలయంలో ప్రార్ధనా మందిరాల కూల్చివేత ఘటనపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.  దీనిపై సిఎం కేసీఆర్ స్పందించారు.  ప్రార్ధనా మందిరాలకు అనుకోకుండా జరిగిన సంఘటన ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు. సచివాలయంలో ప్రత్యేకంగా ఆలయాలను నిర్మిస్తామని అన్నారు. 

 

అందరూ దీన్ని మంచి హృదయంతో అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు ఉన్న మందిరాల కంటే విస్త్రీర్ణంగా కొత్త దేవాలయాలను నిర్మిస్తామని సిఎం అన్నారు. ఎన్ని కోట్లు అయినా సరే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది అని సిఎం కేసీఆర్ అన్నారు. ప్రార్ధన మందిరాల నిర్వాహకులతో తాను ప్రత్యేకంగా మాట్లాడతా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణా  లౌకిక రాష్ట్రం అని సమాఖ్య స్పూర్తిని కొనసాగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: