తెలంగాణా సచివాలయం కూల్చివేత పనులకు హైకోర్ట్ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సోమవారం వరకు కూల్చివేత పనులను నిలిపివేయాలి అని ఆదేశాలు ఇచ్చింది తెలంగాణా హైకోర్ట్.  నాలుగు రోజుల క్రితం... కూల్చివేత పనులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.  ఎక్కడిక్కడ పటిష్ట చర్యలు తీసుకుని భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. 

 

సిఎస్, డీజీపీ వంటి ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కూల్చివేత పనులను నిర్వహిస్తున్నారు. సచివాలయంలో ఉన్న దేవాలయాలను కూల్చివేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సిఎం కేసీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే.  కూల్చివేతకు ఇటీవల హైకోర్ట్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  అయితే దేవాలయాల విషయంలో వివాదాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: