కరోనా సోకిన వ్యక్తులు ఆస్పత్రిలో ఉండాలి అంటే చాలు భయపడుతున్నారు. వారికి ఇప్పుడు ప్రాణాల మీద భయమా లేక మరో కారణమా తెలియదు గాని ఆస్పత్రుల్లో ఉండాలి అంటే చాలు భయపడిపోతున్నారు. హైదరాబాద్ సహా కొన్ని ఆస్పత్రుల్లో ఇప్పుడు కరోనా రోగులు ఇళ్ళకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

తాజాగా తెలంగాణాలో క సంఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఒక వ్యక్తికి కరోనా రాగా అతన్ని ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ కు తరలించారు. కాని అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతను బయటకు వచ్చాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆస్పత్రిలో ఉండలేను అని ఇంటికి వెళతానని సిబ్బందికి నానా రకాల చుక్కలు చూపించాడు. పోలీసులకు సమాచారం అందడం తో వారు వచ్చి అతనికి నచ్చేజెప్పి  లోపలికి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: