తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తమకు అనుమానాలున్నాయని.... ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయాలని హైకోర్టులో రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. నేడు హైకోర్టు నవీన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించలేమని తేల్చి చెప్పటంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదని పిటిషనర్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించలేమని.... ముఖ్యమంత్రి కనిపించకపోతే హెబియస్ కార్ప్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. సీఎం ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు వస్తున్నాయని, దీంతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రజలు ఆందోళ చెందుతున్నారని పేర్కొన్న పిటిషన్ పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు నవీన్ కు షాక్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: