ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడు సహా 9 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా అధికారులు పితాని పీఎస్ మురళీ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న పితాని పీఎస్ మురళీమోహన్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచింది. అయితే పిటిషన్ గురించి తీర్పు వెలువడకముందే మురళీమోహన్ ను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆయన మున్సిపల్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తుండగా సచివాలయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: