కేంద్రం లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు పడిన కష్టాలను గుర్తించి వాళ్ల కోసం అద్దె ఇళ్లను సిద్దం చేస్తోంది. అద్దె ఇళ్ల ద్వారా స్థిర నివాసం లేని వాళ్లకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో 70,000 ఇళ్లను కేంద్రం సిద్ధం చేసింది. కొన్ని రోజుల క్రితం కేంద్రం ఈ పథకానికి ఆమోద ముద్ర వేసింది. 
 
కేంద్రం తొలి దశలో భాగంగా ఈ ఇళ్లను వలస కార్మికులకు అద్దెకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఈ ఇళ్లకు అద్దెని నిర్ణయించనుందని తెలుస్తోంది. నగరాలకు ఉపాధి కోసం లక్షల సంఖ్యలో వలస కార్మికులు వస్తూ ఉంటారు. వారందరికీ ఈ ఇళ్లు ఉపయోగకరంగా ఉంటాయని మోదీ సర్కార్ భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: