స్టార్ హీరో కమల్ హాసన్ గొప్ప మనస్సును చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న తమిళనటుడు, విలన్ పొన్నంబ‌ళ‌మ్ కు ఆర్థిక చేయూత అందించడానికి ముందుకొచ్చారు. ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని తెలుసుకున్న క‌మ‌ల్ హాస‌న్ చికిత్సకు అయ్యే డబ్బు తాను అందజేస్తానని... ఆయ‌న పిల్ల‌ల చ‌దువు ఖ‌ర్చుల‌ని కూడా తానే భ‌రిస్తాన‌ని మాట ఇచ్చారు. 
 
పొన్నంబళమ్ కమల్ హాసన్ తో కలిసి 'అపూర్వ సా‌గోధ‌రార్గ‌ల్‌', 'మైకేల్ మ‌ద‌న కామ‌రాజ‌న్' లాంటి చిత్రాలలో నటించారు. ర‌జినీకాంత్ న‌టించిన‌ 'ముత్తు', 'అరుణాచ‌లం', అజిత్ 'అమ‌ర్క‌ల‌మ్'‌, విక్ర‌మ్ 'సామి'  చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పొన్నంబళమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన వ్యక్తి. పొన్నంబ‌ళ‌మ్ ప్ర‌స్తుతం వెంటిలేటర్‌పై తమిళనాడులోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: