కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ లోని కోట్ల మంది యూజర్లు టిక్ టాక్ కు దూరమయ్యారు. మరికొన్ని దేశాలు కూడా చైనాపై ఉన్న వ్యతిరేకత వల్ల టిక్ టాక్ బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ చైనాకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రధాన కార్యాలయాన్నీ బీజింగ్ కు దూరంగా తరలించే ప్రయత్నం చేస్తోంది. 
 
అయితే ప్రధాన కార్యాలయం ఎక్కడికి మారబోతుందనే సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది. టిక్ టాక్ ప్రస్తుతం చైనా మరకలను తొలగించుకునే ప్రయత్నం చేస్తోంది. తమ వ్యాపారాలకు విఘాతం కలగకుండా చైనాతో అన్ని సంబంధాలను తెంచుకోవాలని భావిస్తోంది. చైనా నుంచి టిక్ టాక్ తరలిపోతే ఆ దేశానికి ఆర్థికంగా నష్టం వాటిల్లనుంది. మరో యాప్ హలో కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: