గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కరడుగట్టిన నేరస్తుడు వికాస్‌ దూబే నిన్న ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కాడు. అతన్ని తరలిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని ఓ కారు కాన్పూర్‌ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఇదే అదనుగా భావించిన దూబే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. అతని మృతదేహాన్ని కాన్పూర్‌ ఆసుత్రికి తరలించారు.

 

ఈ నేపథ్యంలో వికాస్ దుబే మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితం నెగెటివ్‌గా తేలింది. మరోవైపు కాన్పూర్ ఆసుపత్రిలో దుబే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. అయితే వికాస్ దుబే శరీరంలో మొత్తం నాలుగు బుల్లెట్లున్నాయని వైద్యులు తెలిపారు. జులై రెండున బిక్రూ గ్రామంలో దుబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. దూబేపై బీజేపీ ఎమ్మెల్యే హత్యసహా 60 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: