ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని కాల్చి చంపడం ఏమో గాని విపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నాయి. వారం రోజుల నుంచి తప్పించుకుని తిరిగిన అతను నిన్న నాటకీయ పరిణామాల మధ్య దొరకడం, అతని ఎన్కౌంటర్ కూడా దాదాపు అదే విధంగా జరగడం వంటివి ఇప్పుడు విపక్షాలు బిజెపి సర్కార్ ని తీవ్ర స్థాయిలో విమర్శించే విధంగా చేస్తున్నాయి. 

 

తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత  ప్రియాంకా చోప్రా దీనిపై కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను 'అప్రధ్ ప్రదేశ్'గా మార్చింది. వికాస్ దూబే వంటి నేరస్థులు అధికారంలో ఉన్న వ్యక్తుల ద్వారానే అభివృద్ధి చెందుతున్నారని ఆమె ఆరోపించారు. మొత్తం కాన్పూర్ ఎపిసోడ్‌లో సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: