తెలంగాణాలో రెవెన్యూ మున్సిపల్ శాఖల తర్వాత అత్యధికంగా లంచాలు తీసుకుంపోలీసులే అని లెక్కలు చెప్తున్నాయి. భూ వివాదాల్లో ఎక్కువగా తల దూర్చి డబ్బులు వసూలు చేస్తున్నారు ఖాకీలు. బంజారా హిల్స్ జూబ్లిహిల్స్ సహా షాభాద్ లో ఏసీబీ కి చిక్కారు పోలీసు అధికారులు. 

 

ఈ ఏడాది అత్యధికంగా ఏసీబీకి దొరికింది ఖాకీలే అని తాజాగా లెక్కలు చెప్తున్నాయి. 2019లో మొత్తం 18 నుంచి 20 మంది ఖాకీలు ఏసీబీకి పట్టుబడ్డారని తాజాగా లెక్కల్లో వెల్లడించారు. 2020లో మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా దొరికింది వాళ్ళేనట. నిన్న ఒకరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల బంజారా హిల్స్ ఎస్సై ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: