ఆంధ్రప్రదేశ్ లో పించన్ విషయంలో సిఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జగన్ ఇచ్చిన మాట ప్రతీ ఏటా 250 పెంచుకుంటూ వెళ్లి నాలుగేళ్ళలో మూడు వేలు చేస్తామని. చెప్పిన విధంగానే ఆయన మొదటి ఏడాది పించన్ ని పెంచారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా ఆయన పించన్ ని పెంచారు. కోట పించన్ ని ఆగస్ట్ నుంచి అందిస్తారు. 

 

ప్రస్తుతం నెలకు రూ.2250 పింఛను వస్తుంది. వచ్చే నెల నుంచి రూ.2500 అందనుందని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సిఎం జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ఇక ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పించన్ ని కూడా  పెంచారు. దీనిపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: